హైదరాబాద్: సీమాంధ్ర నేతల వల్లే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏకత్రాటి పైకి రాలేక పోతున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని సొసైటీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధుల సమావేశానికి ముందు వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై తాను చిత్తశుద్ధితో పోరాడుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ నేతలు ఏకాభిప్రాయానికి రాక పోవడానికి సీమాంధ్ర నేతలే కారణం అన్నారు.
తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి సమయం ఇవ్వాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు. త్వరలో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తాము విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. లేదంటే పార్లమెంటు సమావేశాలను తాము స్థంభించడానికి సిద్ధం అని చెప్పారు.

Source:news.oneindia.in
No comments:
Post a Comment