BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, May 29, 2011

జూ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతిల హనీమూన్ స్పాన్సర్స్ ఎవరంటే..?

Jr Ntr-Chandrababu Naidu వైభవంగా పెళ్లి చేసుకొని ఘనంగా భార్య లక్ష్మీప్రణతిని ఇంటికి తెచ్చేసుకున్న జూ ఎన్టీఆర్ ప్రస్తుతం హనీమూన్ లో వున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ ‘మహానాడు’ సంబరాలు మొదలయ్యాయి. పార్టీ భవిష్యత్తు దిశానిర్ధేశకులుగా నారాలోకేష్, జూ ఎన్టీయార్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు ‘మహానాడు’ మహా వేదికగా మారింది. నారా లోకేష్ రాజకీయ ఆరంగెట్రానికి ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకోవాలని చూస్తున్నారు నారా అనుచరులు. 

ఇదే వేదిక మీద జూ ఎన్టీఆర్ కూడా వుంటే లోకేష్ కు తిప్పలు తప్పవు. అందుకే అదను చూసి ఎన్టీఆర్ ను తప్పించేందుకు చంద్రబాబు నాయుడు తెలివిగా జూ ఎన్టీఆర్ కి టికెట్లు స్పాన్సర్ చేసాడని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతైనా మావయ్య నాయుడు కుదిర్చిన సంబంధమే కనుక కిమ్మనకుండా ప్లైట్ ఎక్కేసాడట జూ ఎన్టీఆర్..అంతే కాకుండా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి హరికృష్ణ మాత్రమే ‘మహానాడు’కు హాజరైనట్టు సమాచారం

Source:something.com

No comments:

Post a Comment