BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, May 29, 2011

నిజంగానే క్రింద పడిపోయాను,దెబ్బలు బాగా తగిలాయి: కాజల్

Kajalఆడేటప్పుడు నిజంగానే కింద పడిపోయేదాన్ని. దెబ్బలు కూడా తగిలాయి తెలుసా అంటోంది కాజల్.ఆమె రీసెంట్ గా 'వీర'చిత్రంలో కబడ్డి చిట్టిగా చేసింది. ఆ చిత్రం లో కబడ్డి ఆడిన విధానం గురించి చెబుతూ ఇలా స్పందించింది.అలాగే కబడ్డి ఆట గురించి అసలు నాకు దాని గురించి తెలీదు.'వీర' కోసమే ప్రత్యేకంగా నేర్చుకొన్నాను. నేను కబడ్డీ ఆడే సన్నివేశాలన్నీ రాజమండ్రిలో చిత్రీకరించారు. అమ్మో.. ఏం వేడి? అస్సలు తట్టుకోలేకపోయాను.

ఇక దర్శకుడు రమేష్‌ వర్మ నా పాత్ర గురించి మొదటిసారి వివరించినప్పుడు 'లేడీ డాన్‌.. ఆడ రౌడీ ఇలాంటి లక్షణాలున్న అమ్మాయివి. పైగా కబడ్డీ ఆడాలి' అని చెప్పారు. వినగానే ఇదేదో తమాషాగా ఉందే అనిపించింది. అందుకే వెంటనే ఒప్పుకొన్నాను. పూర్తి మాస్‌ తరహా పాత్ర ఇది. కొంత మంది 'చాలా కొత్తగా కనిపించావు' అన్నారు. మరి కొంత మందికి చిట్టీ పడిన పాట్లు నచ్చలేదు. ప్రశంసనీ, విమర్శనీ రెండింటినీ స్వీకరించాను అంది.అయితే ఇంత కష్టపడి చేసిన పాత్ర భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.వీర చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది


Source:something.com

No comments:

Post a Comment