BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, May 29, 2011

'ఊసరవెల్లి' చిత్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు...!

Jr Ntr జూ యన్.టి.ఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఊసరవెల్లి'చిత్రం మార్కెట్ పరంగానూ మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం డిస్ట్ర్రిబ్యూషన్ రైట్స్ కోసం ఎందరో పెద్ద మొత్తాలతో ప్రయత్నించినప్పటికీ ఆ పోటీని ఎదుర్కొని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఆంద్ర దేశమంతటా విడుదల చేయటానికి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పంపిణి హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం.వరసగా పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ ఎదుగుతున్న ఈ సంస్ధ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా వచ్చి ఇలా ఓ పెద్ద సినిమా రైట్స్ తీసుకోవటడం ఎవరూ ఊహించని పరిణామం.

ఇక ఈ మద్యనే నాగార్జున హీరోగా నటిస్తున్న 'రాజన్న' సినిమా డిస్త్రిబ్యుషన్ హక్కులను కైవశం చేసుకుంది.ప్రస్తుతం 'ఊసరవెల్లి' కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ ఫై బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు



Source;something.com

No comments:

Post a Comment