సెక్సీ కాస్ట్యూమ్స్ ధరించడమే కాక, లిప్‌లాక్ సన్నివేశాల్లో కూడా తొలిసారి నటించాను. అయితే లాంగ్విటీ కోసం కాదు. ‘తీన్ మార్’అల్ట్రా మోడరన్ గాళ్‌గా నటించాను. ఆ క్యారెక్టర్ కి తగినట్లు ఉండాలని అలా చేసాను. ఆ పాత్ర తీరుతెన్నులు అలాగే ఉంటాయి. సెక్సీగా కనిపించినా, లిప్‌లాక్ చేసినా అవన్నీ సన్నివేశం పండటానికే తప్ప. లాంగ్విటీ కోసం కాదు. అవసరం లేకపోతే అలాంటివి పొరపాటున కూడా చేయను అని చెప్పింది త్రిష. ఇక తీన్ మార్ హిట్ అవటం గురించి చెబుతూ..
నా అభిమాన హీరో పవన్‌తో తొలిసారి చేసిన ‘తీన్ మార్’ ఇంత హిట్ అవ్వడం చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది అంది. అయినా కష్టపడి, ఇష్టపడి ఈ సినిమా చేశాను. ఫలితం ఎలా ఉంటుందో అని కాస్త టెన్షన్‌కి కూడా లోనయ్యాను. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని వారి స్పందనను లైవ్‌లో తిలకించాలని, ఫ్యామిలీతో కలిసి చెన్నయ్ సత్యం ధియేటర్‌లో సినిమా చూశాను. వారి ఆనందం చూసి నా నోట మాట రాలేదు అని చెప్పుకొచ్చింది. అలాగే తాను తన కెరీర్ ప్రారంభంలో అంటే పదేళ్ళ క్రిందట..దర్శకుడు జయంత్ ని కలిసానని, ఇన్నాళ్ళకు కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది.
No comments:
Post a Comment