రీసెంట్ గా విడుదలైన శక్తి చిత్రంలో ఎన్టీఆర్ ..శక్తి పీఠాలను సంరక్షించే రుద్ర గా కనిపిస్తాడు.ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బద్రీనాధ్ చిత్రంలో అల్లు అర్జున్ శివక్షేత్రపాలకుడిగా కనిపిస్తాడు.అదే పోలక రెండు చిత్రాలకూ అంటున్నారు.అలాగే శక్తి పీఠాలల నేఫద్యంలో శక్తి కథ నడిస్తే..బద్రీనాధ్ చిత్రం బద్రీనాధ్ నేపధ్యంలో కథ నడుస్తుంది. రెండు చిత్రాలకీ ప్లాష్ బ్యాక్ లో పీరియడాక్ కథ వస్తుంది.ఇక శక్తి చిత్రం ఆల్రెడీ రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బద్రీనాధ్ ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక బద్రీనాధ్ చిత్రం గురించి ..నటుడిగా బన్నీలోని కొత్త కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది అని నిర్మాత అల్లు అరవింద్ అంటున్నారు. అల్లు అర్జున్ హీరో గా వివి వినాయక్ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘బద్రినాథ్’. తమన్నా ఇందులో హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.ఈ చిత్రం విశేషాలు చెపుతూ ఆయన ఇలా స్పందించారు.అలాగే బద్రినాథ్ ఓ ఎపిక్. అద్భుతాన్ని చూస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు పంచే అపురూప చిత్రం ఇది అన్నారు.
No comments:
Post a Comment