BREAKING NEWS
Monday, April 18, 2011
ఇదే నా చివరి చిత్రం కూడా అనుకుంటాను: అనుష్క
నా ప్రతి సినిమాని తొలి సినిమాగానే భావిస్తాను. అంతేకాదు ఇదే నా చివరి చిత్రం కూడా అనుకుంటాను. ఎందుకంటే సక్సెస్ చుట్టూ తిరిగే పరిశ్రమలో నేను వున్నాననే విషయాన్ని ఎప్పుడూ మరిచిపోను. ఇక నుంచి నా కేరక్టర్ కంటే ఎక్కువగా సక్సెస్‌కే విలువిస్తాను. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమా తీస్తుంటే అందులో కేవలం నా పాత్ర గురించే ఆలోచించడం సరికాదు. కమర్షియల్ వాల్యూస్ వున్న చిత్రాలు చేస్తూ నిర్మాతలకు లాభాన్ని చేకూర్చలన్నదే నా అభిమతం. అలా అని సినిమాలో మోర్ గ్లామరస్‌గా కనిపించాలనేది నా కోరిక కాదు.గ్లామరస్‌గా కన్నా అందంగా కనిపించడానికే ప్రయత్నిస్తాను అంటోంది అనుష్క. ప్రస్తుతం అనుష్క తెలుగులో ప్రభాస్ సరసన ‘రెబల్’, నాగార్జునతో ‘డమరుకం’ చిత్రాల్లో నటించనుంది. తమిళంలో విక్రమ్ సరసన ‘దైవ తిరుమగన్’ చిత్రంలో నటిస్తోంది.అలాగే అనుష్క తమిళ వేదం చిత్రంలో నటిస్తోంది. అనుష్క పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో రూపొందుతున్న జీసస్ క్ట్రైస్ట్ అనే చిత్రంలోనూ చేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment