BREAKING NEWS
Monday, April 18, 2011
సల్మాన్ ఖాన్ సినిమాలో అల్లు అర్జున్ హిట్ సాంగ్
ఇటీవల ఐపీఎల్ క్రికెట్ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్‌తో కలిసి శ్రియ ‘రింగరింగ’(ఆర్య 2)పాటకు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఆ పాటకు ప్రేక్షకులనుంచి వచ్చిన విశేష స్పందన దృష్టిలో ఉంచుకుని సల్మాన్‌ఖాన్ తాను నటిస్తున్న ‘రెడీ’ చిత్రంలో ఈ పాటను పెడుతున్నట్లు సమాచారం.ఇక దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య-2’ చిత్రం హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా అందులో సూపర్‌హిట్ అయింది. తమిళంలో కూడా ఈ పాటను విజయ్ నటించిన ‘సుర’ చిత్రంలో పెట్టారు. ఇప్పుడు ఈ పాటను ఇన్నాళ్లకు మళ్లీ బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్, అసిన్‌లు జంటగా నటిస్తున్న తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రంలో వాడుకుంటున్నారు. రీమేక్ చిత్రంలో రీమేక్ సాంగ్ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎయిరిన్ ఏండ్రియా తెలుగులో ఈ పాటకు నర్తించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్ హవా నడుస్తోంది కనుక ఈ పాటను ఎవరితో డాన్స్ చేయిస్తారో చూడాలంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment