BREAKING NEWS
Monday, April 18, 2011
నేను ఇంత వరకూ అంతలా ఎప్పుడూ ఏడవలేదు: ఇలియానా
నేను ఇంత వరకూ అంతలా ఎప్పుడూ ఏడవలేదు. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆ స్థాయిలో ఉంటాయి. ఇంటికెళ్లాకా కూడా ఏడుపొచ్చేసేది. నన్ను చూసి అమ్మ ఏడ్చేసేది అంటూ ఇలియానా తన తాజా చిత్రం 'నేను నా రాక్షసి' గురించి చెప్పుకొచ్చింది.అలాగే ఈ చిత్రంలో తనను రాక్షసి అని పిలవటం గురించి చెబుతూ..పూరి జగన్నాథ్ ఏది చేసినా దానికో అర్థం ఉంటుంది. నన్ను రాక్షసి అని పిలిచినా అది కథ అవసర్థామే. 'నేను నా రాక్షసి' చిత్రంలో నన్ను చూసిన ఎవరికైనా అలాగే పిలవాలనిపిస్తుంది అంది.ఇక నేను ఈ చిత్రంలో అసాధారణంగా ప్రవర్తించే ఓ సాధారణ యువతి పాత్ర నాది. రాక్షసి అంటే తిట్టనే ఎందుకు అనుకోవాలి. ప్రేమతో కూడా పిలవచ్చు కదా అంది.ఇక శక్తి ఫ్లాప్ గురించి మాట్లాడుతూ..హిట్టు ప్లాపు అనేది మనం నిర్ణయించలేం. అదంతా దర్శకుడి చేతుల్లో ఉంటుంది. నా వరకూ నాకు మంచి పేరే వస్తోంది అని తేల్చేసింది.అలాగే ఈ చిత్రంలో ఇలియానా ద్విపాత్రాభినయం చేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment