విజయవాడ: కళ్లు మూసి తెరిచే లోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వందల కోట్ల రూపాయలు సంపాదించారని, ఇదంతా రాజకీయ అవినీతి మంత్రంతోనే సాధ్యమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. వైయస్ జగన్ సంపాదనపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్వజమెత్తారు. పుట్టపర్తి సత్య సాయిబాబా ట్రస్టు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
భూ ఆక్రమణ కేసులో నారాయణ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. కేసును కోర్టు కొట్టేసింది. భూపోరాటాల సందర్భంగా నారాయణపై ఈ కేసు నమోదైంది. తనపై కేసును కొట్టిసిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరిన్ని భూపోరాటాలు చేస్తామని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment