నాని, సమంతలతో ‘ఈగ’ సినిమాని రూపొందిస్తోన్న రాజమౌళి, ఆ సినిమా తర్వాత ప్రభాస్ తో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమా తర్వాతగానీ, లేదంటే ప్రభాస్ సినిమాకన్నా ముందుగానీ అనుష్కతో ఓ సినిమా తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడట. విక్రమార్కుడు సినిమాలో అనుష్కను అందాల బొమ్మగా చూపించిన రాజమౌళి, మళ్ళీ అనుష్కపై కన్నేశాడు. వెరైటీగా ప్రయత్నిస్తున్న రాజమోళి అనుష్క కోసం ఒక కథను తయారు చేశాడు. కోడి రామకృష్ణ అనుష్కను జేజెమ్మగా మార్చి ప్రేక్షకులతో జై కొట్టించుకున్నాడు. మళ్ళీ అంతటి పవర్ ఫుల్ హీరొయిన్ ఓరియెంటెడ్ కథ ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ స్క్రిప్ట్ నే తయారు చేసాడు రాజమోళి. కర్తవ్యం సినిమాలో విజయశాంతి నటనకు దాసోహమైన అనుష్కకు అలాంటి సినిమా అయితే మంచి గుర్తింపు తెస్తుందని భావిస్తుండగా రాజమౌళి అలాంటి స్క్రిప్టునే సిద్ధం చేస్తున్నాడని సమాచారం.
అయితే షూటింగులున్నా, లేకపోయినా కూడా ఎప్పుడూ హైదరాబాదులోనే వుండే కథానాయిక అనుష్క, మొన్న ఆదాయపు పన్ను శాఖ వాళ్లు చేసిన దాడితో హైదరాబాదు మీద అలిగి బెంగళూరు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రిలాక్స్ అవుతూ, హాలిడేని ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంచితే, ఈ మంగుళూరు బ్యూటీ నటించిన రెండు తమిళ సినిమాలు వచ్చే నెలలో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. తెలుగులో వచ్చిన 'వేదం' సినిమా రీమేక్ అయిన 'వానం', విక్రంతో చేసిన మరో సినిమా రిలీజ్ అవుతున్నాయి. అలాగే, తెలుగులో నాగార్జునతో చేస్తున్న 'డమరుకం', ప్రభాస్ తో చేస్తున్న 'రెబెల్' సినిమాల షూటింగులు కూడా వచ్చే నెలలో మొదలవుతాయి.
No comments:
Post a Comment