బాలకృష్ణ హీరోగా 'శ్రీ కీర్తి కంబైన్స్' పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ చిత్రం షూటింగ్ ను విశాఖపట్నం జిల్లా అటవీ ప్రాంతంలో చేయడానికి అటవీశాఖ అధికారులు పర్యావరణ కారణాలు చూపుతూ అనుమతించలేదు. అప్పట్లో పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ సినిమా కోసం భారీ సెట్టింగులు వేశారు. దీంతో అధికారులు షూటింగుకు అనుమతి నిరాకరించారు. సెట్టింగును తీసికెళ్లడానికి కూడా అధికారులు అంగీకరించలేదు. దీంతో వివాదం కోర్టుకెక్కింది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చేసుకుంటున్నామని, విశాఖ జిల్లా అటవీ ప్రాంతంలో వేసిన సెట్‌ను తీసుకెళ్లడానికి అధికారులు అనుమతించడం లేదని, ఒకసారి వేసిన సెట్ మరో చోట వినియోగించుకోడానికి అనువుగా చేశామని, ఇక్కడ వేసిన సెట్‌కు లక్షలాది రూపాయలు వ్యయమైందని, వీటిని తీసుకెళ్లడానికి అనుమతించాలని చిత్రం యూనిట్ కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి ఆస్తులు జప్తు(సీజర్ ఫ్ ప్రొపర్టీ) చేయడానికి ఆదేశాలు లేకుండా ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించింది. కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.
No comments:
Post a Comment