BREAKING NEWS
Saturday, April 16, 2011
త్రిష, రవితేజ ఆ రీమేక్ లో జంటగా చేయనున్నారు
ఇటివల హిందీలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన 'బ్యాండ్ బాజా బారత్' సినిమాను యుటివి మూవీస్ వారు తెలుగు, తమిళ బాషలలో నిర్మించనున్నారు. ఆ చిత్రంలో అనుష్క శర్మ పోషించిన పాత్రలో నటించడానికి త్రిషను ఎంపిక చేసుకున్నారు. అలాగే రెండు బాషలకు అనువుగా ఉండే హీరో కోసం నిర్మాణ సంస్థ ప్రత్నిస్తుందని సమాచారం.అయితే రవితేజ ఈ పాత్రను పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.దాంతో రవితేజ,త్రిష కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది.ఇక త్రిష ...పవన్ కళ్యాణ్ తో చేసిన తీన్ మార్ చిత్రం నిన్న(గురువారం) విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఇక తీన్ మార్ బాలీవు్డ్ చిత్రం లవ్ ఆజ్ కల్ కి రీమేక్.ఈ రీమేక్ హిట్ అవటంతో ఇదే మూడ్ లో త్రిష మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక ప్రస్తుతం త్రిష వెంకటేష్ సరసన బాడీగార్డ్ రీమేక్ లో చేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment