ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, January 24, 2011
బెల్లంకొండ అసలైన బాడీగార్డ్ బాలకృష్ణా..?ప్రభాసా..?
బెల్లంకొండ అసలైన బాడీగార్డ్ బాలకృష్ణా..?ప్రభాసా..?
మలయాళంలో ‘బాడీగార్డ్’ పేరుతో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తమిళంలో ‘కావలన్’ పేరుతో తమిళంలో రీమేక్ చేసారు. మలయాళంలో దిలీప్-నయనతార నటించిన ఈ చిత్రం తమిళ రీమేక్ లో విజయ్-అసిన్ నటించారు. వరుసగా రెండు భాషల్లో విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేసేందుకు బెల్లకొండ సురేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే తెలుగు రీమేక్ రైట్స్ స్వంతం చేసుకున్న బెల్లంకొండ సురేస్ ఈ చిత్ర కథానాయకుడి కోసం అన్వేషణ చేస్తున్నారు. ఈ చిత్రానికి సూటవుతారని భావించబడుతున్న హీరోలందరికీ స్పెషల్ షోలు వేసి ఈ చిత్రాన్ని చూసిస్తున్నారు.
బాలకృష్ణ మొదలుకుని పలువురు టాప్ హీరోల పేర్లు వినిపిస్తున్నప్పటికీ..ఈ చిత్రంలో ఫైనల్ గా ప్రభాస్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ చిత్రం సందేహాస్పదమైనందున, ‘మిస్టర్ పెర్ ఫెక్ట్’ తర్వాత ‘బాడీగార్డ్’ లో నటించే అవకాశముందని తెలుస్తోంది. ఇకపోతే, ఈ చిత్రంలో హీరో ఎవరు నటిస్తారనే విషయాన్ని పక్కన పెట్టి, ఈ చిత్ర కథానాయికను ఫైనలైజ్ చేసేందుకు బెల్లకొండ చర్చలు జరుపుతున్నారు. మలయాళ వెర్షన్ లో నటించిన నయనతార, తమిళ వెర్షన్ లో నటించిన అసిన్ లతోనూ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం అందుతోంది.
No comments:
Post a Comment