హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ ముఖ్య అనుచరులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. భాను కిరణ్ గన్‌మన్ మన్మోహన్ సింగ్‌ను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు భాను కిరణ్ మరో అనుచరుడు సుబ్బయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పోలీసులు మాత్రం ఈ అరెస్టులను ధ్రువీకరించడం లేదు.
మన్మోహన్ సింగ్, సుబ్బయ్యలే భాను కిరణ్‌ను రాష్ట్ర సరిహద్దులు దాటించారని అనుమానిస్తున్నారు. మన్మోహన్ సింగ్ రివాల్వర్‌తోనే భాను సూరిని హత్య చేశాడని కూడా ప్రచారం సాగుతోంది. వారిద్దరి ద్వారా భాను కిరణ్ ఆచూకీకి సంబంధించిన కూపీని లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
No comments:
Post a Comment