ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, January 24, 2011
టూ పీస్ బికినీ కూడా పాపులారిటీకే: త్రిష
టూ పీస్ బికినీ కూడా పాపులారిటీకే: త్రిష
బికిని వేయడమే బరితెగింపు అయితే, టూ పీస్ బికినీకి కూడా పాపులారిటీ ఎలా వస్తుందని, సెన్సార్ దాన్ని ఎలా అంగీకరిస్తుందని ప్రశ్నిస్తోంది హీరోయిన్ త్రిష . ట్రెండ్ మారుతోందనీ, మారుతున్న కాలానికి అనుగుణంగా గ్లామర్ కొత్త పుంతలు తొక్కుతోందనీ చెబుతోన్న త్రిష, ట్రెండ్ కి తగ్గట్టుగా అప్ టు డేట్ గా వుండాలని క్లాస్ పీకేస్తోంది. అయితే ఎంతగా ట్రెండ్ ని ఫాలో అయినా, వల్గారిటీ జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటానని త్రిష చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ అవకాశాల కోసం కాస్తంత ఎక్స్ పోజింగ్ డోస్ పెంచిన మాట వాస్తవమే కదా..అనడిగితే, బాలీవుడ్ అవకాశాల కోసం కాదుగానీ, మోడ్రన్ లుక్ కోసమే అలా ట్రై చేశానని అతి తెలివి ప్రదర్శిస్తోంది త్రిష. నెంబర్ల పొజిషన్ పై నమ్మకం లేదనీ, ఏ రంగంలో అయినా ముందుండాలని అనుకోవడం తప్పులేదుగానీ, ఆ పొజిషన్ కోసం అడ్డదార్లు తొక్కడం తనకు నచ్చదని త్రిష అంటోంది.
No comments:
Post a Comment