హైదరాబాద్: సాక్షి మీడియాలో పెట్టుబడులపై రాష్ట్ర హైకోర్టు సోమవారం మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు నోటీసులు జారీ చేసింది. జగన్ సహా సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టినవారందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చేనేత మంత్రి పి. శంకరరావు రాసిన లేఖను హైకోర్టు సూమోటాగా స్వీకరించి నోటీసులు జారీ చేసింది. మంత్రి కాక ముందు తాను మీడియా సమావేశంలో మాట్లాడిన విషయాలపై హైకోర్టు ప్రతిస్పందించిందని శంకర రావు చెప్పారు.
సాక్షి పెట్టుబడుల కేసులో ఏడుగురు అధికారులతో సహా 52 మందిని ప్రతివాదులుగా హైకోర్టు చేర్చింది. సాక్షిలో పెట్టుబడుల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షి పత్రిక, సాక్షి చానెల్‌ల్లో పెట్టుబడులు పెట్టిన అన్ని సంస్థలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 14వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వైయస్సార్ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని వాడుకుని సాక్షి మీడియాను జగన్ స్థాపించారని శంకర రావు పలుమార్లు ఆరోపణలు చేశారు.
No comments:
Post a Comment