ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, January 18, 2011
ఆయన చేతిలో బాబాయి ఇర్కున్నాడు నేను మాత్రం ఇరుక్కోనంటున్న జూ ఎన్టీఆర్..
ఆయన చేతిలో బాబాయి ఇర్కున్నాడు నేను మాత్రం ఇరుక్కోనంటున్న జూ ఎన్టీఆర్..
సింహా సినిమా లాంటి బాక్సాఫీసు విజయానందంలో ఉన్న బాలయ్య బాబుని పరమవీర చక్క అంటూ బాలయ్య బాబు ఇమేజ్‌ని డామేజ్ చేసిన దాసరి నారాయణరావు త్వరలో తన 151వ సినిమా తీస్తున్నానని ప్రకటించాడు. దీనితో దాసరి తన 151వ సినిమా ఏహీరోతో చేస్తాడనే చర్చలు ఆరంభమయ్యాయి. తాజాగా దీనిపై ఎన్టీఆర్ గతంలో చేసినటువంటి సర్దార్ పాపారాయుడు చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిలింసిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఈసినిమా సీక్వెల్‌ని దాసరి నారాయణరావు జూ ఎన్టీఆర్ తోచేయనున్నారని సమాచారం. ఐతే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దాసరి చేతినుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఇది మాత్రమే కాకుండా సింహా తర్వాత బాబాయికి ఒక రేంజి హిట్ ఇస్తాడని అనుకుంటే బాబాయి ఇమేజ్ నిపూర్తిగా డామేజ్ చేసినందుకు దాసరిపై జూనయర్ ఎన్టీఆర్ కూడా చాలా కోపంగా ఉన్నారని సమాచారం. అంతేకాకుండా ఏదో ప్రస్తుతానికి నామానాన నేను కుర్ర డైరెక్టర్లుతో సినిమాలు తీసుకుంటూ బ్రతుకుతున్నాను. అలాంటి నాజీవితాన్ని అమాంతం తీసుకెళ్శి దాసరి చేతిలో పెట్టలేనంటూ జూ ఎన్టీఆర్ తప్పించుకుంటున్నాడని సమాచారం.
No comments:
Post a Comment