ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, January 18, 2011
రవితేజ సినీ కెరీర్ నుంచి ఎప్పుడు రిటైర్ అవుతారంటే...
రవితేజ సినీ కెరీర్ నుంచి ఎప్పుడు రిటైర్ అవుతారంటే...
రవితేజ తాజా చిత్రం మిరపకాయ విజయాన్ని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడుతూ...తాను రిటైరయ్యేది లేదని,తన చివరి క్షణం వరకూ నటిస్తూనే ఉంటానని అన్నారు. అలాగే తను యేడాదికి ఇన్ని సినిమాలు చేయాలి అన్ని చేయాలి అన్న ఆలోచన లేదని, ఎన్ని అవకాశం ఉంటే అన్ని చేస్తూనే ఉంటానని అన్నారు.అలాగే తన చిత్రాల్లో కామిడి అనేది ఉండేలా చూసుకుంటానని జీవితంలోనే ఎంతో డ్రామా ఉండగా తన సినిమాలతో వారిని మరింత విసుగు తెప్పిచదలచుకునే ఆలచన లేదని అన్నారు. అలాగే తనకు వేరే వ్యాపకం ఏదీ లేదని సినిమానే తనకు ఆహారం, శ్వాస, జీవితం అన్నారు. ఇక తనకు ట్రాజిక్ ఫిల్మ్ లు అంటే అస్సలు ఇష్టం ఉండవని, రెండున్నర గంటల సేపు తన సినిమాకు వచ్చిన వారు రిలాక్స్ అవ్వాలని, అందుకే వారిని నవ్వించాలనే ప్రయత్నిస్తూంటనని అన్నారు.ఇక తను సీరియస్ రోల్స్ పోషించదలిచినా విక్రమార్కుడు లాంటి సినిమాలు ఎన్నుకుని ఎంటర్టైన్ మెంట్ మిస్ కాకుండా చూసుకుంటానని అన్నారు. అలాగే తన మిరపకాయ చిత్రాన్ని కావాలని సంక్రాంతికి పోటీకి పెట్టలేదని,అది కో ఇన్సెడంట్ గా జరిగిందని,ఎన్ని సినిమాలు ఉన్నా తన సినిమా విజయం సాధించటంతనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు.
No comments:
Post a Comment