BREAKING NEWS
Tuesday, January 18, 2011
సుమంత్ 'గోల్కొండ హైస్కూల్' రిజల్ట్ ఏమిటి?
సంక్రాంతికి విడుదలైన సుమంత్ తాజా చిత్రం "గోల్కొండ హైస్కూల్". అష్టా చెమ్మా చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరోసారి కలర్స్ స్వాతిని తీసుకుని క్రికెట్ క్రీడ నేఫద్యలో ఈ చిత్రం తెరకెక్కించారు. స్లో నేరషన్, ఆకట్టుకోని కథనం, వినోదం లేకపోవటంతో ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలకపోతోంది. అక్కడక్కడా బావుంది అని పించినా టోటల్ గా ఈ చిత్రం ప్రేక్షకుల నాడి పట్టుకోవటంతో విఫలమయిందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక కథ విషయానికి వస్తే...హైదరాబాద్ లోని గోల్కొండ హైస్కూల్ కు కార్పోరేట్ వాతావరణంతీసుకొచ్చి హైటెక్ కోచింగ్ సెంటర్ గా తీర్చిదిద్దాలి అనే ప్రపోజల్ తో వస్తాడు ఆ స్కూల్ కు ట్రస్టీ కిరీటి (సుబ్బరాజు). అందుకోసం ఎందుకూ పనికిరాకుండా ఉన్న స్కూల్ గ్రౌండ్ లో కోచింగ్ కాంప్లెక్స్ కట్టాలి అని పట్టు పడతాడు. పిల్లలకు చదువెంతో ఆటలూ అంతే అని ఆలోచించిన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ విపత్తును ఆపటానికి స్కూల్ లో క్రికెట్ కోచ్ గా ఒకప్పటి పాత విద్యార్ధి సంపత్(సుమంత్) ను రప్పిస్తాడు. క్రికెట్ ప్లేయర్ అయిన సంపత్ గ్రౌండ్ ను కాపాడే క్రమంలో కిరీటి తో ఇప్పుడున్న టీంను ఇంటర్ స్కూల్ చాంపియన్ గా నిలబెడతాను అని చాలెంజ్ చేస్తాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment