ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, January 18, 2011
కృష్ణవంశీ నెక్ట్స్ చిత్రం ‘నాగవంశ’ లేటెస్ట్ ఇన్ఫో ...
కృష్ణవంశీ నెక్ట్స్ చిత్రం ‘నాగవంశ’ లేటెస్ట్ ఇన్ఫో ...
కృష్ణవంశీ, నాగార్జన కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నాగవంశ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఈ నలుగురూ కలిసి నటిస్తే నటించనున్నారు. ఈ నలుగురు కలిసి నటించే చిత్రానికి సంబంధించి దర్శకుడు కృష్ణవంశీ మంచి కథను తయారు చేసుకున్నారు. కథ నాగార్జునకు నచ్చడంతో పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో పడ్డారు కృష్ణవంశీ. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది అందరికీ నచ్చే విధంగా వుంటుందని, నాగార్జున అభిమానులతో పాటు ప్రేక్షకులు నచ్చే, మెచ్చే అంశాలు ఇందులో వుంటాయని నిర్మాత చెబుతున్నారు. ఇది ఓ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. భారీ స్థాయిలో తెరకెక్కిస్తాం. ఎక్కడా రాజీపడకుండా చిత్రం రూపుదిద్దుకోనుంది అని ఆయన చెబుతున్నారు. చూద్దాం ఈ ‘నాగవంశ’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
No comments:
Post a Comment