అయితే మౌనికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడికి గ్రామస్థులు దేహశుద్ది చేశారు. సంఘటనపై సమాచారం అందిన పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. ఆ సమయంలో మరోసారి గ్రామస్థులు ఆ యువకుడిని పోలీసు జీపులో నుండి బయటకు లాగి అతనిని చెట్టుకు కట్టేసి కొట్టి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. అయితే యువకుడిని అరెస్టు చేయడానికి ఎస్ఐ, ఇద్దరు పోలీసులు మాత్రమే రావడంతో వేలాదిగా ఉన్న గ్రామస్తులను నిలువరించడం కుదరలేదు. మౌనికపై యువకుడి దాడికి గల కారణాలను పోలీసులు కూపి లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతను ఒక్కడే ఉన్నాడా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.
Source:something.com
No comments:
Post a Comment