మరోసారి పోకిరి రోజుల్ని తలపుకి తెస్తున్న ‘దూకుడు’ టీజర్ చూసిన తర్వాత ఈ చిత్రానికి బిజినెస్ క్రేజ్ అమాంతం రెట్టింపయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఆగస్టులో విడుదలకి సిద్దమవుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న దూకుడుని ‘నమో వెంకటేశ’ నిర్మించిన 14రీల్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తోంది.
పోకిరి తర్వాత అయిదేళ్లుగా విజయం లేని మహేష్ బాబు ఈ సినిమాతో ఆ కొరత తీర్చి మళ్లీ విజయాల బాట పడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం భారీ చిత్రాలన్నింటికీ సంగీతం అందిస్తున్న థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నాడు..
Source:something.com
No comments:
Post a Comment