తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌ను బలపరిచినవారు అంతంత మాత్రంగానే ఉన్నారు 12.6 శాతం మంది మాత్రమే లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుందని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణకు అప్పగిస్తే పార్టీ బలపడుతుందని 14.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాగా, ఏమీ చెప్పలేమని అన్నవారి శాతం 18.5 శాతం ఉంది. అయితే, ఈ పోల్‌కు పరిమితులు ఉన్నాయనే విషయాన్ని పాఠకులు గుర్తించాల్సి ఉంది. రాష్ట్రంలో నెట్ వాడకందార్లు చాలా తక్కువ మంది. పైగా, నిరక్షరాస్యులకు ఇది అందుబాటులో ఉండే అవకాశం లేదు. నెట్ అందుబాటులో ఉండి, చదువుకున్నవారి అభిప్రాయం మాత్రమేనని గుర్తించాల్సి ఉంటుంది. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రజాకర్షణ శక్తి ఎక్కువ ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
Source:something.com
No comments:
Post a Comment