దాని తర్వాత రామోజీరావు హైకోర్టుకు హాజరు కానందున, కర్ణాటక హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారిచేసింది. అయితే గత్యంతరం లేక రామోజీరావు గత ఎప్రిల్ నెల 19తేదిన హైకోర్టుకు హాజరై షరత్తులతో కూడిన క్షమాపణలు కోరుకున్నాడు. కేసు విచారణ జరపుతూ మే 31 కి వాయిదా వేశారు. అనగా ఈ రోజు(మే 31)న కేసు విచారణ జరిగింది. న్యాయమూర్తులు వేగు సూరి అప్పారావు, ఆనంద్ ఆద్వర్యంలో ద్విసభ్య బెంచ్ వారు విచారణ జరిపింది. ఆరోగ్యం బాగోలేదని, కొన్ని అనివార్య కార్యాలవల్ల తను కోర్టు హాజరు కాలేనని ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రై.లి చైర్మెన్ రామోజీరావు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకొంటానని న్యాయస్థానానికి బేషరత్తులతో కూడిన క్షమాపణలు కోరుతూ అర్జి సమర్పించారు.
ఈ విషయంపై న్యాయమూర్తులు విచారణ జరిపి తర్వాత రామోజీరావు, టిఎన్ సీతారామ్ పై కేసు వేసిన జిఆర్ మోహన్ కు ఎటువంటి అభ్యంతరం లేనందున..ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రమోజీరావుకి, టిఎన్ సీతారామ్ కి హెచ్చరించి కేసు కొట్టివేయడమైనది.
Source:something.com
No comments:
Post a Comment