BREAKING NEWS
Saturday, February 19, 2011
ఇది వ్యాపారం కోసం చేసిన సినిమా కాదు...వివి వినాయిక్
''ఇది వ్యాపారం కోసం చేసిన సినిమా కాదు. కేవలం మంచి కథపై ఉన్న ప్రేమతో చేసిన చిత్రం'' అన్నారు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో గగనం చిత్ర విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గెస్ట్ గా హాజరైన వివి వినాయిక్ ఇలా స్పందించాడు. నాగార్జున మాట్లాడుతూ..''నాగార్జున కొత్త కథలు చేస్తారని అందరూ అంటుంటారు. గగనం సినిమాతో నాకు ఆ పేరు మరింతగా పెరిగింది. నా భవిష్యత్తుకు ఒక పెట్టుబడిలాంటిది ఈ సినిమా. మా హీరో మంచి సినిమా చేశారని నా అభిమానులు కూడా గర్వంగా చెప్పుకొంటారు.తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలు రూపుదిద్దుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. వాళ్లకూ గట్టి సమాధానం ఇచ్చిన చిత్రం 'గగనం'. ఇకపై వాణిజ్య చిత్రాల్లో నటించడంతోపాటు మంచి కథలొస్తే ఇలాంటివీ చేస్తానన్నారు. ''ఎంత ఎదిగినా ఓ విజన్‌తో పనిచేసే నటుడు నాగార్జున. తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలకు అండగా నిలిచార''న్నారు ప్రకాష్‌రాజ్.ఈ కార్యక్రమంలో శిరీష్, రవిప్రకాష్, భరత్‌రెడ్డి, పూనమ్‌కౌర్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment