BREAKING NEWS
Saturday, February 19, 2011
రానా 'దమ్ మారో దమ్' విడుదల తేది ఎప్పుడంటే...
లీడర్ తో తెలుగువారికి పరిచయమైన దగ్గుపాటి రానా తొలి బాలీవుడ్ చిత్రం 'దమ్ మారో దమ్' ఏప్రిల్ 22న విడుదల కానుంది. రోహన్ సిప్పీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, రానా, బిపాషా బసు, ప్రతీక్ బబ్బర్ (రాజ్‌బబ్బర్ కుమారుడు) కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ చిత్రలో రానా, బిపాషా జంటగా చేసింది.అలాగే దేవానంద్ సూపర్ హిట్ 'హరే రామ హరే కృష్ణ'లోని పాపులర్ సాంగ్ 'దమ్ మారో దమ్'ని ఈ సినిమాలో రీమిక్స్ చేశారు. ఆ పాటకి దీపికా పదుకోనే డాన్స్ చేసింది. డ్రగ్స్, సెక్స్, రాక్ అండ్ రోల్ పార్టీల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. గోవా నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించాడు. అక్కడ స్ధానిక గోవా కుర్రాడుగా రానా కీలక పాత్రని చేశాడు. రమేశ్ సిప్పీ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక 'దమ్ మారో దమ్' చిత్రంలో తన పాత్ర గురించి చెపుతూ... ' ఈ సినిమాలో నేను గోవా యువకుడిగా నటిస్తున్నాను. ఇందుకోసం గిటార్, బైక్ రైడింగ్ నేర్చుకున్నాను. సినిమాలో నేను కొంకిణి భాష మాట్లాడాలి. సినిమాకు ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పడమని ఉండదు. షూటింగ్ జరుగుతుండగానే వాయిస్ రికార్డ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment