BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Saturday, February 19, 2011

ప్రభాస్, సెన్సేషన్ డైరెక్టర్ రాజమౌళిల ఫాంటసీ చిత్రం ప్రెస్ మీట్ విశేషాలు...?

Prabhas-Rajamouliప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ఫ్యాంటసీ కథా చిత్రం రూపొందనుంది. కె.రాఘవేంద్ర రావు సమర్పణలో ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీనిని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను ఈరోజు (ఫిబ్రవరి 18) ఉదయం హైదరాబాదులోని సినీ మేక్స్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వివరించారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ‘నా కెరీర్ ప్రారంభమైంది రాఘవేంద్ర రావు గారి వద్దే. 'ఘరానా బుల్లోడు' సినిమా కి తొలిసారిగా వర్క్ చేసాను. ఆ తర్వాత పలు సినిమాలకు పని చేసాను. అంటే, ఇది నా సొంత బ్యానర్ లాంటిది.

అలాగే, ప్రభాస్ తో 'ఛత్రపతి' తర్వాత చేస్తున్న సినిమా ఇది. కథ ఇంకా పక్కాగా తయారవ్వలేదు. అయితే, ఓ లైన్ అనుకున్నాను. ఫుల్ ఫ్యాంటసీ సినిమా అవుతుంది. ఆ విధంగా నా కోరిక తీరుస్తుంది. సెప్టెంబర్ లో సెట్స్ కి వెళతాం. మొత్తం పూర్తవడానికి ఓ ఏడాది పడుతుంది. బడ్జెట్ పరంగా చాలా పెద్దది. 'మగధీర' కంటే ఎక్కువ అవుతుంది. అందుకే, తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వుంటాయి. వినోదాన్ని కోరుకునే వారికి విందు భోజనం లాంటి సినిమా అవుతుంది’ అన్నారు. హీరో ప్రభాస్ మాట్లాడుతూ, ’మా నాన్న గారికి రాఘవేంద్ర రావు గారు మంచి మిత్రులు.

అలాగే పెదనాన్నకు కూడా! ఆయనకు 'బొబ్బిలి బ్రహ్మన్న' వంటి పెద్ద హిట్ ఇచ్చారు. రెండేళ్ల నుంచి అనుకుంటున్నాం, ఈ సినిమా చేయాలని. ఇప్పటికి కుదిరింది. ఇలాంటి సినిమా మళ్లీ నా కెరీర్ లో వస్తుందో, రాదో తెలియదు. అంతటి స్పాన్ వున్న సినిమా ఇది’ అన్నాడు. ఇంకా ఈ కార్యక్రమంలో కీరవాణి, ఎడిటర్ రవీందర్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment