BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Saturday, February 19, 2011

రోడ్డు ప్రమాదంలో బిజెపి నేత వనం ఝాన్సీ మృతి

Vanam Jhansiహైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, బిజెపి అధికార ప్రతినిధి వనం ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వనం ఝాన్సీ మరణంతో రాష్ట్రం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని బిజెపి నేతలు అంటున్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. శుక్రవారం ఆమన్‌గల్ మండలంలోని ఓ గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టా కార్యక్రమానికి ఆమె వెళ్లారు. రాత్రి కావటంతో అచ్చంపేటలో రాత్రి బస చేశారు. ఆ తర్వాత ఉదయాన్నే హైదరాబాద్‌కు తిరుగు కారులో ప్రయాణం అయ్యారు. ఆమన్‌గల్ మండలం కడ్తాల్ వద్దకు వచ్చిన తర్వాత వెనుక నుండి వచ్చిన ఇన్నోవా కారు ఝాన్సీ ఉన్న కారును ఢీకొట్టింది.

దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే హైదరాబాద్‌ కంచెన్‌భాగ్ డిఆర్‌డీవోలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యలో మరణించారు. కారులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరొకరు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వనం ఝాన్సీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా, అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమెపై ఎలాంటి విమర్శలు లేకపోవడం విశేషం.

No comments:

Post a Comment