BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, January 31, 2011

టాలీవుడ్ కెప్టెన్‌గా విక్టరీ వెంకటేష్, కోలీవుడ్ కెప్టెన్‌గా సూర్య

టాలీవుడ్ కెప్టెన్‌గా విక్టరీ వెంకటేష్, కోలీవుడ్ కెప్టెన్‌గా సూర్య

 Venkateshవిక్టరీ వెంకటేష్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్స్ లేని సమయాల్లో ఏ దేశంలో క్రికెట్ జరిగినా అక్కడ వాలిపోతుంటారాయన. అలాగే విష్ణుకి కూడా క్రికెట్ అంటే మోజు. తాజాగా అందరి కళ్లూ త్వరలో జరగబోయే ‘సిసిఎల్’ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మ్యాచ్‌లపైనే ఉన్నాయి. సినీ తారలు కలిసి ఆడనున్న ఈ మ్యాచ్‌లను తనివి తీరా వీక్షించడానికి ప్రేక్షకులు రెడీ అయిపోతున్నారు. మరోవైపు ఈ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి, కొనుగోలు చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి కనబరచడం విశేషం. ఈ ఆరోగ్యకరమైన పోటీలో టాలీవుడ్ టీమ్‌కి యజమానిగా వ్యవహరించే అవకాశాన్ని మంచు విష్ణు చేజిక్కించుకున్నారు. టాలీవుడ్ టీమ్‌కు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి కనబర్చిన తరుణంలో ‘వెంకటేష్’ ఆ బాధ్యతను స్వీకరిస్తున్నారని ‘టాలీవుడ్ టీమ్ ఓనర్’ విష్ణు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

హీరోలు క్రికెట్ ఆటలో సత్తా చూపడానికి రెడీ అవుతుంటే మరోవైపు హీరోయిన్లు ఆట మైదానంలో అందంగా ప్రత్యక్షమై ఆటగాళ్లను ‘చీర్ అప్’ చేయనున్నారు. ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా టాలీవుడ్ టీమ్‌కు అందాల తారలు తాప్సీ, సమంత ప్రచారకర్తలుగా ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా తమిళ టీమ్‌కు సూర్య కెప్టెన్‌గా.. అక్కడి నడిగర్ సంఘం (ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఓనర్‌గా వ్యవహరించడానికి తీర్మానం అయ్యాయి. కన్నడ టీమ్‌కు పునీత్ రాజ్‌కుమార్, హిందీకి కెప్టెన్ కమ్ ఓనర్‌గా సల్మాన్‌ఖాన్ వ్యహరించబోతున్నారు. ఆ కోరికతోనే టీమ్ ఓనర్‌గా వ్యవహరించడానికి ముందుకొచ్చారు. ఇక టాలీవుడ్ టీమ్‌లో ఏయే ఆర్టిస్టులు ఆడబోతున్నారనే విషయం త్వరలో తెలుస్తుంది. ‘‘ఫిబ్రవరి 14లోపు ఆటగాళ్లను నిర్ణయించి, టీమ్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తాం’’ అని విష్ణు తెలిపారు.

No comments:

Post a Comment