BREAKING NEWS
Monday, January 31, 2011
అవమానం భరించలేకనే సూరిని హత్య చేసిన భాను కిరణ్?
హైదరాబాద్: సెటిల్‌మెంట్లు, బెదిరింపుల ద్వారా వచ్చిన స్థిరాస్తులు, భూములు తన పేరు మీద రాయాలంటూ మద్దెలచెర్వు సూరి ఒత్తిడి తెచ్చినందుకే భాను కిరణ్ అతడి హత్యకు పథకం రచించాడని పోలీసుల వద్ద మన్మోహన్‌సింగ్, సుబ్బయ్య వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. సూరి కొంతకాలంగా అసభ్య పదజాలంతో దూషించడం, కొట్టేందుకు యత్నించడంతో అవమానం భరించలేకే అతడిని చంపేద్దామంటూ భాను నిర్ణయానికి వచ్చాడని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. మద్దెలచెర్వు సూరి బినామీ పేర్లతో ఉన్న ఆస్తులతో పాటు భానుకిరణ్ సొంతంగా సెటిల్‌మెంట్లు చేసేవాడని సుబ్బయ్య పోలీసు అధికారులకు చెప్పాడు. ఐదారేళ్లుగా మాత్రమే భానుతో పరిచయం ఉందని, అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేవాడినన్నారు. సూరిని చంపేయాలనుకున్నట్టు భాను తనకు కొద్దిగంటల ముందు మాత్రమే చెప్పాడని, తాను భయం వ్యక్తం చేస్తే అలాంటిదేం లేదంటూ ఒప్పించాడని మన్మోహన్‌సింగ్ చెప్పినట్టు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment