BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, January 31, 2011

పవన్ కళ్యాణ్ అవుట్ అండ్ అవుట్ ఎక్సిపిరిమెంటల్ మూవీ...

పవన్ కళ్యాణ్ అవుట్ అండ్ అవుట్ ఎక్సిపిరిమెంటల్ మూవీ...

 Pawan Kalyanఇటీవల రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఓ మెసేజ్ పోస్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ‘క్రియేటివ్ వర్క్’ అనే బ్యానర్ ఎలాంటి క్రియేషన్ లేకుండా వరుసగా రీమేక్ సినిమాలు చేసేస్తున్నాడన్నది ఆ మెసేజ్ సారాంశం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘దబాంగ్’ సినిమాని క్రియేటివ్ వర్క్ బ్యానర్ లో రీమేక్ గా గబ్బర్ సింగ్ చేయబోతున్నానని పోస్టర్ ని విడుదల చేశారు. దాని గురించి వర్మ మరోరకంగా స్పందించాడు, మరి ఇలా తన గురించి అవాకులు, చెవాకులు మాట్లాడేవారికి టిట్ ఫర్ టాట్ ఇవ్వాలనుకున్నాడో ఏమో గానీ..పవన్ కళ్యాణ్ ఓ ఎక్సిపిరిమెంటల్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో పాటలు ఉండవట. అవుట్ అండ్ అవుట్ ఎక్సిపిరిమెంటల్ చిత్రంగా రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు పవన్ కళ్యాణ్ బయట పెట్టనున్నాడని సమాచారం.

No comments:

Post a Comment