BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, September 29, 2014

ఔటర్‌లో కారు తుక్కు: ముగ్గురు దుర్మరణం (పిక్చర్స్)






హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ సూర్యనారాయణ కుటుంబసభ్యులతో గచ్చిబౌలిలోని జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య నాగరామలక్ష్మి (53) నాలుగు రోజుల క్రితం విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లింది. రాజమండ్రిలో ఎంబీబీఎస్‌ చదువుతున్న కూతురు సింధూర (19)ను దసరా పండగకు హైదరాబాద్‌ తీసుకురావాలనుకుంది. తల్లీకూతుళ్లతో పాటు నాగరామలక్ష్మి సోదరుడు మహీధర్‌ (50), అతడి కుమార్తె అపర్ణ (20) సోమవారం కారులో హైదరాబాద్‌ బయలుదేరారు. మార్గమధ్యంలో శంషాబాద్‌ మండల పరిధిలోని కిషన్‌గూడ జంక్షన్‌ వద్ద ఆగి ఉన్న కర్నాటక రాష్ట్రానికి చెందిన లారీని కారు ఢీకొంది. సగ భాగం లారీ కిందకి దూసుకుపోవడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న మహీధర్‌, నాగరామలక్ష్మి, సింధూరకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ అపర్ణను శంషాబాద్‌లోని ట్రైడెంట్‌ ఆస్పత్రికి తరలించారు.
source:news.oneindia.in

No comments:

Post a Comment