BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, June 5, 2011

ఎవరీ బాబా రామ్‌దేవ్?

Baba Ramdevఅవినీతికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న యోగా గురు రామ్‌దేవ్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో ఆరోగ్యంపై చైతన్యం పెరిగిన ప్రస్తుత సందర్భంలో యోగాను ప్రచారం చేయడం ద్వారా ప్రజాదరణ పొందారు. టెలివిజన్, వీడియోల ద్వారా దేశంలోని ప్రజలకు ఆయన దగ్గరయ్యారు. ఇప్పుడు యోగా గురు రామ్‌దేవ్‌ను గుర్తు పట్టని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి లేదు. సామూహికంగా యోగా చేయడానికి ఆయన శిబిరాలకు వేలాది మంది తరలి రావడం సంప్రదాయంగా మారింది. దేశవ్యాప్తంగా సంచరిస్తూ యోగా శిబిరాలు నిర్వహించడం ఆయన తన పనిగా పెట్టుకున్నారు. 

నల్లటి గడ్డం, పొడవైన తల వెంట్రుకలు, వాటిని ముడిచి కొప్పు పెట్టే పద్ధతి ఆయన ప్రత్యేకత. అతి క్లిష్టమైన యోగాసనాలను ప్రదర్శించడం ఆయన విశిష్టత. డెహ్రాడూన్ సమీపంలో హరిద్వారాలో గల ఆయన సంస్థలకు ప్రజలు పెద్ద యెత్తున వచ్చిపోతుంటారు. యోగా, ఆయుర్వేదం ద్వారా అన్ని జబ్బులకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెబుతారు. ఎయిడ్స్, క్యాన్సర్ వ్యాధులకు కూడా తన వద్ద మందులున్నాయని ప్రకటించడం ద్వారా ఆయన వివాదస్పదంగా మారారు. అయితే, ఎయిడ్స్‌ రోగులు యోగా ద్వారా ఊరట పొందవచ్చునని మాత్రమే తాను చెప్పానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

టెలివిజన్ చానెళ్లలో విస్తృతంగా కనిపించే బాబాకు రాజకీయాకాంక్ష కూడా ఉంది. సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి తాను రాజకీయ పార్టీని స్థాపిస్తానని ఆయన ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన పార్టీ అభ్యర్థులు మాత్రం 543 సీట్లకు పోటీ చేస్తారని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రణాళిక మారినట్లు ఉంది. అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేపట్టారు.

బాబా రామ్‌దేవ్ 1965లో హర్యానాలోని అలిపూర్ గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు రామకిషన్ యాదవ్. రామకిషన్ పాఠశాలలో 8న తరగతి వరకు చదివారు ఆ తర్వాత హరిద్వారాకు మారి ఉచితంగా యోగా శిక్షణ ఇవ్వడం, పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ఆయన హిందూ ప్రాచీన గ్రంథాలను చదివారని, వివిధ గురుకులాల్లో వాటిని బోధించారని అంటారు. రామ్‌దేవ్ పలు ట్రస్టులు, గురుకులాలు, ఫౌండేషన్స్ స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా శిబిరాలు నిర్వహిస్తున్నారు .ప్రాణాయామ అతను ప్రదర్శించే యోగాసనాల్లో అతి ముఖ్యమైంది. సామూహిక యోగాసనాల కార్యక్రమం టెలివిజన్‌లో ప్రసారం కావడంతో 1995లో ఆయనకు ప్రజాదరణ పెరగడం ప్రారంభమైంది. అప్పుడప్పుడు ఆయన స్వదేశీ సిద్ధాంతం గురించి మాట్లాడుతుంటారు


Source:news.oneindia.in

No comments:

Post a Comment