మహంకాళి సినిమా షూటింగులో గాయపడిన హీరో రాజశేఖర్ కోలుకుంటున్నారు. చెన్నైలో మహంకాళి షూటింగులో రాజశేఖర్ గాయపడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం గాయపడిన రాజశేఖర్‌ను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత ఆయన చెన్నైలోని తమ ఇంటికి మారారు. వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజశేఖర్ భార్య జీవిత చెప్పారు. ఎడమ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. కుడి చేయి మణికట్టుకు కూడా గాయాలయ్యాయి. దీనికి శస్త్ర చికిత్స అవసరం కావచ్చునని భావిస్తున్నారు.
కుడి చేయి మణికట్టుకు ఆపరేషన్ అవసరమైతే హైదరాబాదులో చేయించుకోవాలని రాజశేఖర్ భావిస్తున్నారు. ఆయన శుక్రవారమే హైదరాబాదుకు చేరుకున్నారు. మామూలు స్థితికి చేరుకోవడానికి రాజశేఖర్‌కు నాలుగైదు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు

Source:news.oneindia.in
No comments:
Post a Comment