సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రజనీ ఆస్పత్రిలో చేరిన తర్వాత మీడియాలో ఆయన ఆరోగ్యం పట్ల రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ వార్తలు విని అభిమానులు ఆందోళన గురిఅవుతున్నారు.వారంతా రజనీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని వారు ఉబలాటపడుతున్నారు.అందుకోసం రజనీ అల్లుడు వారిని సంతోషపరచటానికి..తన ట్విట్టర్‌లో ఈ ఫొటోని కూడా పొందుపరిచారు.
తన కుమార్తె ఐశ్వర్యతో రజనీకాంత్ చిరునవ్వులు చిందిస్తూ... ‘ఐ యామ్ ఆల్‌రైట్’ అన్నట్లు చూపుతున్నఈ ఫొటో ఆస్పత్రిలో తీసింది.రజనీ ఆరోగ్యంగా ఉన్నారనే విషయాన్ని అభిమానులకు తెలియజేయాలనే ఆకాంక్ష తోనే ఈ ఫొటోని ట్విట్టర్‌లో పెట్టానని, సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దని, సూపర్ స్టార్ రాక్స్ అని ధనుష్ పేర్కొన్నారు. ఈ ఫొటోని పత్రికలవారు ముద్రించమని కూడా ధనుష్ ఆ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు
No comments:
Post a Comment