BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, April 15, 2011

Q4 ఫలితాలను ప్రకటించిన ఇన్పోసిస్, లాభం రూ 1,818 కోట్లు

 Infosys



ముంబై: ఇండియాలో ఐటిలో లీడింగ్‌గా ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీ తన నాల్గవ త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఐతే ఈ ఫలితాలు మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు మాత్రం తగ్గాయాని అంటున్నారు. శుక్రవారం ప్రకటించినటువంటి ఈ ఫలితాలు 14శాతం లాభాలు అంటే దాదాపు రూ 1,818 కోట్ల రూపాయలను గడించాయన్నమాట. ఈ సందర్బంలో బోర్డ్ ప్రతిఒక్క రూ 5 షేర్‌కి ఫైనల్ డివిడెంట్‌ని రూ 20గా నిర్ణయించడం జరిగింది.



భారతదేశంలో రెండవ అతి పెద్దదైన సాప్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ గత సంవత్సరం(2009-2010) మార్చి సంవత్సరంతో పోల్చుకంటే ఈ సంవత్సరం దాదాపు రూ 1,600 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించినట్లు బాంబే స్టాక్ ఎక్సెంజ్ లో ఫైలింగ్ అవ్వడం జరిగింది. ఇక మార్కెట్ ఎనలిస్ట్‌ల ప్రకారం మార్చి 31వ తారీఖుకల్లా 3.3-6.7శాతం నెట్ ఫ్రాపిట్ ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అంటే ఇది డబ్బు రూపంలో రూ 1839.40 - రూ 1899.20 కోట్ల రూపాయలుగా వస్తుందని అంచనా..

గత సంవత్సరంతో పోల్చుకున్నటైతే సాప్ట్‌వేర్ సర్వీసెస్, ప్రోడక్ట్స్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్స్ ద్వారా రూ 5,944 కోట్ల రూపాయలు రాగా అదే ఈ సంవత్సరం రూ 7250 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇక క్యాష్ అండ్ క్యాష్ రూపేణ పోయిన సంవత్సరం రూ 15,819 కోట్ల రూపాయలు రాగా అదే ఈ సంవత్సరం మాత్రం మార్చి 31కల్లా రూ 16,810కోట్ల రూపాయలను రాబట్టింది.

ఈ సందర్బంలో ఇన్పోసిస్ సిఈవో మేనేజింగ్ డైరెక్టర్ గోపాల కృష్ణన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మేము డిమాండ్ వాతావరణం చాలా సాధారణంగా ఉంటుందని అనుకున్నాం. మార్కెట్‌లో కస్టమర్‌తో మాకున్నటువంటి మంచి సంబంధాలే ఈరోజు మమ్మల్ని అభివృధ్ది పధంలో నడిపిస్తున్నాయని అన్నారు. ఇక రాబోయే క్వార్టర్ అంటే జూన్ 30, 2011కల్లా మేము రూ 7,311 -రూ 7,382 కోట్ల రూపాయల లాభాలు రావచ్చునని అంచనా వేస్తున్నాం అన్నారు. ఇక ఈ ఫైనాన్సియల్ సంవత్సరం 2012 కల్లా రూ 31,727- రూ 32,720 కోట్ల రూపాయల లాభాలు రావచ్చునని అంచనాలు వేస్తున్నాం అని అన్నారు.

ఈ సందర్బంలో కంపెనీ ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ యస్‌డి శిభులాల్ మాట్లాడుతూ మాకు ఉన్నటువంటి క్లయింట్స్‌తో ప్యూచర్‌ ఫోకస్ ఉంటుందని అన్నారు. చివరగా కంపెనీ డైరెక్టర్ టివి మోహాన్ దాస్ పాయ్(డైరెక్టర్ హెచ్‌ఆర్) జూన్ 2011నుండి తన విధులకు రాజీనామా ప్రకటించారు

No comments:

Post a Comment