BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, April 15, 2011

సినిమాలు ఆపేస్తామంటూ కార్మికులను హెచ్చరిస్తున్న నిర్మాతలు

Suresh Babuవేతనాల పెంపు విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించకపోతే సినిమా నిర్మాణాలు ఆపేస్తామని తెలుగు సినీ నిర్మాతలు కార్మికులను హెచ్చరిస్తున్నారు. కార్మికులు షూటింగులకు రాకపోతే స్వచ్ఛందంగా సినిమా నిర్మాణాలను ఆపేస్తామని వారంటున్నారు. నిర్మాతల మండలికి, ఎపి చలనచిత్ర కార్మిక సంఘాల సమాఖ్యకు మధ్య జరిగిన చర్చలు శుక్రవారం విఫలమయ్యాయి. తాము పెంచిన వేతనాలకు 16 కార్మిక సంఘాలు అంగీకరిస్తుండగా, ఐదు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని నిర్మాతల మండలి ప్రతినిధులు చెప్పారు. ముంబై, చెన్నై, బెంగళూర్‌ల్లో ఇచ్చే వేతనాల కన్నా తాము ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని వారంటున్నారు.

కార్మికుల వేతనాల్లో ఇప్పుడున్న దానికంటే 32 శాతం పెంచేందుకు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలతోపాటు ఒప్పందపత్రాలను త్వరలోనే వారికి అందజేస్తామని నిర్మాతల మండలి సభ్యుడు దగ్గుబాటి సురేష్‌ ఈరోజు మీడియాతో చెప్పారు. జూనియర్‌ ఆర్టిస్టులకు దినసరి వేతనం రూ. 450 ఇవ్వటానికి సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. 60 శాతం వరకు పెంచాలని వారు కోరుతున్నారని అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అన్నారు. కార్మికచట్టం కంటే ఎక్కువగానే తాము పెంచుతామన్నామని అన్నారు. కార్మికులు అంగీకరించకపోతే ఇతర రాష్ట్రాల కార్మికులతో పనిచేయించుకునేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారన్నారు.

No comments:

Post a Comment