BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, April 15, 2011

ఆరేళ్ల బాలుడిని మూడు రోజులు నిర్బంధించిన స్కూల్ యాజమాన్యం

Hyderabadహైదరాబాద్: ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలుడిని పాఠశాల యాజమాన్య మూడు రోజుల పాటు నిర్బంధించిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఫీజు చెల్లించలేదని ఆరోపిస్తూ ఉదయ్ కిరణ్ రెడ్డి అనే బాలుడిని ఇంటికి పంపడానికి వనస్థలిపురంలోని కెబిఎస్ పాఠశాల యాజమాన్యం నిరాకరించి, పాఠశాలలో నిర్బంధించింది. మిగతా పిల్లలంతా సెలవులకు ఇళ్లకు వెళ్లిపోగా ఆ బాలుడు మాత్రం పాఠశాలలోనే ఖైదీ మాదిరిగా ఉండిపోయాడు. దీనిపై ఉదయ్ కిరణ్ రెడ్డి తండ్రి ఆల్వాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమకు ఇంకా 8 వేల రూపాయల ఫీజు బాకీ ఉన్నారని, ఆ మొత్తాన్ని చెల్లించే వరకు బాలుడిని మీతో పంపబోమని యాజమాన్యం తనతో చెప్పి తన కుమారుడిని నిర్బంధించారని ఆల్వాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడిని పోలీసు స్టేషన్‌కు తెచ్చారు. పాఠశాలకు చెందిన ఇద్దరు యాజమన్య ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాము బాలుడిని నిర్బంధించలేదని, తాము బాలుడిని తీసుకుని వెళ్లాలని చెప్పినా తల్లిదండ్రులకు చెప్పినా వినలేదని పాఠశాల యజమాని భూపతిరెడ్డి చెప్పారు.

No comments:

Post a Comment