BREAKING NEWS
Friday, April 8, 2011
ఇంతకు ముందుకన్నా జాగ్రత్తగా ఉంటున్నా: అల్లు అర్జున్
కథల విషయంలో ఇంతకు ముందుకన్నా జాగ్రత్తగా ఉంటున్నాను..ఫ్యాన్స్ ను సంతృప్తిపర్చడమే ముఖ్యం. ఆ తరవాతే ఏదైనా. మధ్య మధ్యలో 'వేదం'లాంటి సినిమాలు చేయడం మంచిదే అంటున్నాడు అల్లు అర్జున్.ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. వివాహానంతరం తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..'బద్రినాథ్' అందరికీ నచ్చే సినిమా. వచ్చే నెలలో విడుదల చేస్తామన్నారు అల్లు అర్జున్.వివి వినాయక్ దర్సకత్వంలో రూపొందుతున్న 'బద్రినాథ్'చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ రీసెంట్ గా రిలీజై అంతటా క్రేజ్ తెచ్చుకున్నాయి.బద్రీనాద్ తో తనలోని యాక్షన్‌ని మరోసారి ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధమవుతున్నానంటున్నాడు. ఈ సినిమా కోసం వియత్నాం వెళ్లి యుద్ధ విద్యలలో శిక్షణ కూడా తీసుకొన్నాడు.ఈ చిత్రం తర్వాత వరస ప్రాజెక్టులు కమిటయ్యాడు అల్లు అర్జున్.త్రివిక్రమ్, సెల్వరాఘవన్‌లు ప్రస్తుతం బన్నీ కోసం కథలు సిద్ధం చేసుకొంటున్నారు.అల్లు అర్జున్ కి ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment