ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన చెప్పారు. రాజకీయాల కోసం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులను వాడుకునే సంస్కృతి తనది కాదని ఆమె స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండం కాదని ఆమె అన్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెసు గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
యుపిఎ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందనే విమర్శల్లో నిజం లేదని ఆమె అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే అవినీతి ఎక్కువగా ఉందని ఆమె విమర్శించారు.
No comments:
Post a Comment