BREAKING NEWS
Friday, April 8, 2011
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కథయే గోపిచంద్ 'మొగుడు'!..
దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం తన నిజజీవిత కథని తెరకెక్కిస్తున్నాడా? అతనికి సన్నిహితంగా వుండే వర్గాలు చెబుతున్నదానిని బట్టి చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ తో తను తీస్తున్న ‘మొగుడు’ సినిమా కథలో తన నిజ జీవిత సంఘటనలు పలు వున్నట్టు తెలుస్తోంది. రమ్యకృష్ణని వంశీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రమ్యకృష్ణ తమిళ బ్రాహ్మిన్, వంశీ కాపు కమ్యునిటీకి చెందిన వాడు. దాంతో వీరి పెళ్ళికి అప్పట్లో రమ్య వాళ్ళ సైడ్ నుంచి అభ్యంతరం వస్తే, వంశీని గీత రచయిత సీతారామ శాస్త్రి దత్తత తీసుకుని, మెడలో దంజ్యం వేసి, ‘కృష్ణవంశీ శాస్త్రి’గా పేరు కూడా మార్చినట్టు అప్పట్లో టాలీవుడ్ లో వార్తలు కూడా వచ్చాయి. మరి, ఇటువంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయా? అన్నది చూడాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment