మీరు కనుసైగ చేస్తే చాలు ఆ కంప్యూటర్ అలా అలవోకగా దానిపని అది చేసుకుపోతుంది. కంటితో చూస్తూనే అన్నీ లాప్‌టాప్‌లో ఎంచక్కా జరిపించుకోవచ్చు. అటువంటి మానిటర్‌లను శా స్త్రవేత్తలు కనిపెట్టారు. ఇక కంప్యూటర్ ఆటలను సైతం ఎంచక్కా ఆడి గెలిచేయవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడ గేమ్ లేజర్స్ హిట్ చేస్తాయట. కంటి కదలికలకు అనుగుణంగా సమాచారం సైతం అలా స్క్రోల్ అవుతుందట. స్వీడన్‌కు చెందిన టొబ్లి టెక్నాలజి ఇన్‌కార్పొరేషన్ ఇటువంటి లాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. కళ్ళద్దాలు ఉన్నా లేకపోయినా కూడా ఈ లాప్‌టాప్‌ను వాడవచ్చు. అయితే సంప్రదాయంగా వస్తున్న మౌస్ కీ బోర్డు టచ్ స్క్రీన్ వంటి వాటికి ఇది ప్రత్యామ్నయం మాత్రం కాదని వాటికి అనుబంధంగా పని మరింత చురుకుంగా సాగడానికి ప్రస్తుతానికి వాణిజ్య ప్రయోజనాలకోసం మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ బార్బారా బార్క్‌లే చెప్పారు
No comments:
Post a Comment