బాలీవుడ్ లో ఇప్పుడు సీక్వెల్స్ శకం నడుస్తోంది. రీసెంట్ గా హిట్ అయిన 'దబాంగ్', 'యమ్లా పాగ్లా దీవానా' చిత్రాలకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా చేసిన 'దబాంగ్' 2010 లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా అభినవ్ కాశ్యప్ డైరక్టర్ గా పరిచయమయ్యాడు. అయితే 'దబాంగ్' సీక్వెల్ కి మాత్రం అయితే అభినవ్ దర్శకత్వం వహించట్లేదు. 'దబాంగ్' చిత్రాన్ని నిర్మించిన అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ ''కొన్ని వ్యక్తిగత, వృత్తిగత కారణాలతో అభివన్ ఈ చిత్రం చేయటం లేదు. 'దబాంగ్' రెండో భాగానికి నేనే దర్శకత్వం వహించబోతున్నాను అన్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలవనుంది.
ఇక తండ్రీ కొడుకులు ధర్మేంద్ర, సన్నీడియోల్, బాబీడియోల్ కలిసి ఇటీవల నటించిన చిత్రం 'యమ్లా పాగ్లా దీవానా'. సమీర్ కార్నిక్ దర్శకుడాగా పరిచయమవుతూ రూపొందిన ఈ చిత్రం హాస్యతరహా కథాంశంతో తెరకెక్కి విజయం సాధించింది. ఈ చిత్రానికి తాజాగా సీక్వెల్ రూపొందించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాబీడియోల్ ప్రకటించారు. బాబీ మాట్లాడుతూ ''ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించిన పనులు మొదలుపెడుతున్నాం. సీక్వెల్ లోనూ నాన్న, నేను, సన్నీ నటిస్తాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామ అన్నారు.ఇక ఇప్పటికే మర్డర్ సీక్వెల్ మొదలైంది.
No comments:
Post a Comment