నల్గోండ జిల్లా అను ముల మండల కేంద్రం హాలియాలో గ్రహాంతర వాసి సంచరి స్తున్నట్లుగా ప్రచరం జోరుగా సాగు తుంది. ప్రతి ఒక్కరూ దీని గురించే చర్చించు కుంటున్నారు. స్ధానిక గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలలో 9వ తరగతి చదువు తున్న మధుకర్ అనే విద్యార్థి మూడు రోజుల క్రితం సూర్యోదయాన తన ఇంటి ఆవరణలో బ్రష్ చేసుకుంటుండగా అతడికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఇంటి ఆవరణలోని అరటి చెట్టు ఆకుల మధ్య దెయ్యం ఆకారంలో నల్లని శరీర ఆకృతితో తెల్లని కళ్లతో వింత ఆకారంలో ఉన్న మనిషి దృశ్యం కనిపించడంతో సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ దృశ్యాన్ని తమ పాఠశాల ఉపాధ్యాయులకు చూపించడంతో దానిని వారు కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసి చూడటంతో అతడు గ్రహాంతర వాసిగా భావించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్ధానికులు వింత దృశ్యాన్ని కళ్ళారా చూడటానికి నెట్ సెంటర్ల వైపుకు పరుగుతీస్తుండగా టివి ఛానళ్ళ ద్వారా కూడా ఈ దృశ్యం ప్రసారం అవుతుండటంతో గ్రహాంతర వాసి విషయం చర్చనీయాంశంగా మారింది. స్ధానిక సిఐ వెంకటేశ్వర్ రెడ్డి ఎస్‌ఐ బల్వంతయ్య ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి ఆ దృశ్యాలు ఉన్న సెల్ కిట్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు
No comments:
Post a Comment