రాజ్’ సినిమా విషయంలో ప్రియమణి హీరో సుమంత్ తో కుమ్మక్కయి చాలా రాజకీయాలు చేసిందని వదంతులొచ్చాయి. అందులో నటించిన మరో హీరోయిన్ విమలా రామన్ పై ప్రియమణి పెత్తనం చలాయించిందని, నిర్మాతల్ని, హీరోని తన కంట్రోల్ లో పెట్టుకుని విమల క్యారెక్టర్ ని కుదించినందని గుసగుసలు వినిపించాయి. కాదని గట్టిగా చెప్పిన దర్శకుడిని కూడా తొలగించి, విఎన్ ఆదిత్యకి సగం నుంచి బాధ్యతలు అప్పగించారని కూడా అన్నారు. పబ్లిసిటీ విషయంలోనూ విమలని పక్కకి నెట్టి ప్రియమణి సోలో హీరోయిన్ అయినట్టుగా మొత్తం బాధ్యత తానే తీసుకుంది ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న విమలా రామన్ ఎట్టకేలకు ఓపెన్ అయింది.
ప్రియమణి, సుమంత్ రాజ్ పేర్లు ఎత్తకుండానే తన ఆక్రోశం బయటపెట్టింది. మొదట చెప్పినదానికి, తర్వాత తీసేదానికి, థియేటర్లోకి వచ్చిన దానికి కొన్నిసార్లు సంబంధమే ఉండదని, కానీ నిజాయితీగా కృషి చేస్తే ఏనాటికైనా ఫలితం ఉంటుందని విమల ‘రాజ్’ ని ఉద్దేశించి కామెంట్ చేసింది.
No comments:
Post a Comment