మిల్క్ బ్యూటీ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘బద్రీనాథ్’ చిత్రంలో నటిస్తోంది. డబ్బు దగ్గర యమా స్ట్రిక్టు అని పేరు తెచ్చుకున్న కథానాయిక తమన్నా సినిమాకి కోటి పైనే తీసుకుంటోందని ఫిలిం ఇండస్ట్రీలో బాహాటంగానే చెబుతారంతా. పారితోషికం విషయంలో అస్సలు మొహమాటం ఉండదనీ, బేరసారాలు కూడా ఆమె వద్ద కుదరవనీ ఈ ముద్దుగుమ్మకి పేరుంది.
అలాంటి తమన్నా ఇప్పుడు పారితోషికం తగ్గించుకుంటానంటోంది. అయితే, అందరికీ కాదండోయ్... తనకు నచ్చిన పాత్రను ఆఫర్ చేస్తే...అదైనా నేషనల్ అవార్డు వస్తుందన్న నమ్మకం తనకు కలిగితేనేనట! ఎందుకంటే, సినిమా రంగంలో వున్నందుకు ఉత్తమనటిగా జాతీయ అవార్డు అందుకోవాలన్నది తమన్నా చిరకాల కోరిక. ఎప్పటికైనా ఆ కోరికను నెరవేర్చుకోవాలని ఆశపడుతోంది. అందుకని ఎవరైనా తమ వద్ద అలాంటి క్యారెక్టర్ వుంటే కనుక ఆ బుల్లెమ్మని కాంటాక్ట్ చేయచ్చు!
No comments:
Post a Comment