BREAKING NEWS
Wednesday, February 23, 2011
అమృతా రావు చెల్లెలను లైన్ లో పెడుతున్న తెలుగు హీరో
బాలీవుడ్ హీరోయిన్ అమృతారావు చెల్లెలు ప్రీతికా రావు త్వరలో వరుణ్ సందేశ్ సరసన నటించనుంది. ఆమెను పట్టుబట్టి మరీ వరుణ్ సందేశ్ తన చిత్రంలోకి తీసుకున్నారు. పి ఉదయ్ కిరణ్ నిర్మాతగా..కొత్త దర్శకుడు శరవణ్ డైరక్షన్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ లవ్ స్టోరీ మార్చి నుంచి ప్రారంభం కానుంది. మోహన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రీతికారావు..ఇంతకు ముందు తమిళంలో చికు బుకు చిత్రంలో నటించింది. ఇక రీసెంట్ గా అమృతారావు ని కూడా సిద్దార్ధ ప్రక్కన దిల్ రాజు చిత్రం ఓహ్ మై ప్రెండ్ లో అనుకున్నారు కానీ చివరి నిముషంలో ఆమె ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టిన కాస్ట్ కట్టింగ్ రూల్స్ ని ఇష్టపడకపోవటంతో తప్పుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment