BREAKING NEWS
Wednesday, February 23, 2011
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లవర్ గా కరీనా కపూర్
దావూద్ ఇబ్రహీం పాత్రను బేస్ చేసుకుని ఏక్తా కపూర్ నిర్మించనున్న ఒన్స్ అపాన్ ఎ టైమ్ సీక్వెల్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దావూద్ నిజ జీవిత లవర్ మాజీ హీరోయిన్ మందాకిని పాత్రకు గాను కరీనా కపూర్ ని తీసుకుంటున్నారు. అయితే కరీనా డేట్స్ ఎడ్జెస్ట్ అయితే చెయ్యగలను కానీ లేకపోతే కష్టమని చెప్పిందట. అంతగా ఆమె చెయ్యకపోతే విద్యాబాలన్ ని ఆ పాత్రకు తీసుకోవాలని ఏక్తా కపూర్ భావిస్తోంది. ఇక దావూద్ ఇబ్రహీం పాత్రను అక్షయ్ కుమార్ చేస్తున్నారు. అలాగే ఏక్తా కపూర్ ఈ సీక్వెల్ చిత్రాన్ని తొలి భాగంకన్నా భారీ ఎత్తున నిర్మించాలన్నది ఏక్తా ఆలోచన. అందుకనే ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్ లో దావూద్ ఇబ్రహీం పాత్రను ఇమ్రన్ హష్మి చేయగా.. మందాకిని పాత్రను ఎమీ కింగ్‌స్టన్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment