జూ ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి ..నైజాం రైట్స్ నైజాంలో పదికోట్ల రూపాయల వరకూ అమ్ముడయినట్లు తెలుస్తోంది. అది కూడా చాలా పోటీ మీద సిరి మీడియా సంస్ధ సొంతం చేసుకుంది. దాంతో మిగతా ఏరియాల్లో కూడా క్రేజ్ మొదలైంది. ఈ చిత్రం పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈనెల 27న పాటల్ని లలిత కళా తోరణంలో గ్రాండ్ గా పంక్షన్ చేసి విడుదల చేస్తారు.అందుకోసం ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
శక్తి చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... శక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె.అలాగే ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్టులు,గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉంటాయని అన్నారామె. మోహన్ బాబు చిత్రం చిట్టెమ్మ మొగడు తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న చిత్రం ఇదే.
ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.
No comments:
Post a Comment